కామ్రేడ్,, గుండా మల్లేష్ ప్రధమ వర్ధంతి – నివాళులర్పించిన సిపిఐ శ్రేణులు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో కామ్రేడ్,, గుండా మల్లేష్ ప్రధమ వర్ధంతి నిర్వహించారు. గుండా మల్లేష్ చిత్రపటానికి సిపిఐ శ్రేణులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి భారత కమ్యూనిస్టు పార్టీ లో పనిచేస్తూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు విజయం సాధించి సిపిఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన మహనీయుడు కామ్రేడ్,,గుండా మల్లేష్ అన్నారు. పేదల పక్షాన నిరంతరం నిలిచినా గొప్ప పోరాట యోధుడు కామ్రేడ్ గుండా మల్లేష్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పెద్దన్న పాత్ర పోషించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో గుండా మల్లేష్ కృషి మరువలేనిదన్నారు. కామ్రేడ్, గుండా మల్లేష్ లేని లోటు సిపిఐ పార్టీ కి తీరలేనిది అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పోరాటాలు నిర్వహించి పేదప్రజల, ఆదివాసి,గిరిజనులకు ఎన్నో భూ పోరాటాలు నిర్వహించి భూములు పంచిన ఘనత గుండా మల్లేష్ కు చెందుతుంది అన్నారు . ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దేవిదాస్, రాములు, అరుణ్, భాస్కర్, నహిద్, సహిద్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.