ఆడ బిడ్డలకు కానుకగా బతుకమ్మ చీర…..వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ …

రాజన్న సిరిసిల్ల జిల్లా
ఇల్లంతకుంట మండలం వంతడుపుల , రహీంఖాన్ పేట గ్రామాల్లో బతుకమ్మ చీరలను సర్పంచ్ లు కట్ట వెంకట్ రెడ్డి , బిలవేణి పర్శరాం గార్లతో కలిసి చీరలను పంపిణీ చేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ …
ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ ఆడ బిడ్డలకు కేసీఆర్ గారు ఇచ్చే కానుక బతుకమ్మ చీర అని అన్నారు..సిరిసిల్ల నేత కార్మికులకు చీరల తయారీతో ఆర్థిక భరోసా లభించింది అని అన్నారు.. నిరుపేద ఆడ బిడ్డలు బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేందుకే చీరల పంపిణీ కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అన్నారు…తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ గారు అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు..అనంతరం వంతడుపుల గ్రామంలో 871 చీరలు , రహీంఖాన్ గ్రామంలో 590 చీరలను లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయనున్నామని అన్నారు… ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు కట్ట వెంకట్ రెడ్డి , బిలవేణి పర్శరాం , ఉప సర్పంచ్ లు కావ్య- స్వామి , పద్మ – పర్శరాం ,పంచాయతీ కార్యదర్శులు రవీందర్ , రాజ శేఖర్ వార్డు మెంబర్లు అన్నాడి నవీన్ రెడ్డి , దురుముట్ల శ్రీనివాస్ , లెంకలపల్లి లచ్చయ్య, ఏనుగుల బుచ్చిరెడ్డి , గణగోని పద్మ , మరియు టి.ఆర్.ఎస్ రహీంఖాన్ పేట గ్రామ శాఖ అధ్యక్షులు ఏనుగుల పర్శరాములు , అంగన్వాడీ టీచర్లు , సి.ఏ లు , మహిళా సంఘాలు సభ్యులు , రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.