అనంతారం గ్రామంలో డిఎల్ పిఓ విచారణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట. మండలంలోని అనంతారం గ్రామంలో గ్రామ సర్పంచ్ చల్ల నారాయణ గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ గ్రామ వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు ఇటీవల జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారులకు పిర్యాదు చేయగా కలెక్టర్ ఆదేశానుసారం డిఎల్ పిఓ మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టి గ్రామ పంచాయతీ రికార్డులు సీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు సర్పంచ్ పై నిధులు దుర్వినియోగం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రషర్ ద్వారా 3 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడని అలాగే పలు అంశాలపై ఫిర్యాదు చేయగా గ్రామంలో విచారణ చేపట్టి వాటిని పరిశీలించి సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.