అదిలాబాదు జిల్లా తలమడుగు లో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి వేడుకలు

ప్రజానేత్ర న్యూస్, తేదీ:20-10-2021. ఆదిలాబాద్, తలమడుగు మండలం, 

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో కొమురం భీమ్ 81వ వర్థంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు కొమురంభీమ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తలమడుగు జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణలక్ష్మి కొమురంభీమ్ విగ్రహా ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ దివ్య మాధవ్, ఎంపీటీసీలు వెంకట్, హన్మంతు, సోమన్న, సర్పంచులు రఘు, మారుతి, తుడుం దెబ్బ అధ్యక్షులు మనోహర్, మల్కు, పొచ్చన్న, ఆదివాసీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.