అఖిలపక్షం ఆధ్వర్యంలో పోడు భూముల రైతుల సమస్యలను పరిష్కరించాలి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్నగర్ పట్టణంలో ఈ రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోడు భూముల రైతుల సమస్యలను పరిష్కరించాలని వారిని వెంటనే ఆదుకోవాలని ఆదిలాబాద్ పార్లమెంట్ లోని కాగజ్ నగర్ ఎన్టీఆర్ చౌరస్తాలో సడక్ బంద్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిడిపి అదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు గుళ్లపల్లి ఆనంద్ గారు పాల్గొని . ఈ సందర్భంగా మాట్లాడుతూ అదిలాబాద్ నుండి భద్రాచలం వరకు ఉన్నా పోడు భూముల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇచ్చి రైతు బంధు, రైతు బీమా కు అర్హులుగా గుర్తించాలని పోడు భూముల రైతుల తరపున డిమాండ్ చేస్తున్నామని. అదేవిధంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోడు భూముల రైతులకు కన్నీళ్లే మిగిలాయి అని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని.
బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు పోడు భూముల రైతులకు న్యాయం జరిగే వరకూ రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ నిర్వాహక కార్యదర్శి పి. సురేష్ కుమార్ , పట్టణ పార్టీ అధ్యక్షులు రాజేష్, ప్రధాన కార్యదర్శి గులాబ్ రావు ,జిల్లా నాయకులు సిహెచ్ శంకర్, కాగజ్ నగర్ ప్రధాన కార్యదర్శి మకబుల్ హుసేన్ , రాష్ట్ర TNTUC ఉపాధ్యక్షులు సిహెచ్. ప్రభాకర్, సమ్మ గౌడ్, దహెగాం మండల పార్టీ అధ్యక్షులు ఎల్. మధుకర్ , కాగజ్నగర్ కార్యదర్శి సంజీవ్, నారాయణ, కౌటల కార్యదర్శి బాజీరావు అలాగే పోడు భూముల రైతులు తదితరులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.