అక్టోబర్ 2న బతుకమ్మ చీరెలు పంపిణీ

జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 30.

సుదీర్ఘ కాలం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎంపీపీ బి.రాణిబాయ్ రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హిందువులకు బతుకమ్మ చీరెలు, ముస్లింలకు రంజాన్ కానుకలు, క్రిస్టియన్ లకు క్రిస్మస్ కానుకలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ప్రపంచంలో, దేశంలో ఎక్కడ ఈ విధంగా చేసిన దాఖలాలు లేవని ఎంపీపీ బి.రాణిబాయ్ రామారావు పేర్కొన్నారు. బతుకమ్మ సందర్భంగా మహాదేవపూర్ మండలానికి 11690 చీరెలు వచ్చాయని, గాంధీ జయంతి సందర్భంగా అడబిడ్డలకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి 17 రంగుల్లో, 17 డిజైన్లలో నాణ్యమైన అందమైన బతుకమ్మ చీరెలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులు కేసీఆర్ కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని 18 ఏండ్ల వయస్సు ఉన్న ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరె పంపిణీ చేస్తామని, గ్రామ గ్రామానా రేషన్ డీలర్ల ద్వారా బతుకమ్మ చీరెలు పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని ఎంపీపీ బి. రాణిబాయ్ రామారావు పేర్కొన్నారు..

Leave A Reply

Your email address will not be published.