27న భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ

వెల్దుర్తి మండల కేంద్రంలోని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు భారత్ బందులో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ వీదీ దుకాణాలు, ఆటోలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, సిఐటియు మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ 11 నెలలుగా రైతులు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు కోరుతూ మరియు రైతులు పండించిన పంటకు పంట పండించడానికి అయిన ఖర్చు దానికి 50% కలిపి కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని నిరసన చేస్తున్నప్పటికీ, మరియు విద్యుత్తు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, కార్మికులకు హాని కలిగించే కోడ్స్ ను రద్దు చేయాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, మానిటైజేషన్ పేరుతో 100% ప్రభుత్వ ఆస్తులను ప్రవేట్ వాళ్లకు లీజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు 600 వేతనంతో విస్తరించాలని కోరుతూ ప్రజలందరూ భారత్ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల మరియు ఉమ్మడి హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంది అని రాజ్యాన్ని ధ్వంసం చేస్తుంది ఆవేదన వ్యక్తం చేశారు. కావున రైతు సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మద్దతు తో జరుగుతున్న భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరారు. సిఐటియు మండల ఉపాధ్యక్షులు మారన్న, మోటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగరాజు, సీఐటీయూ హమాలి యూనియన్ నాయకులు పెద్ద యేసు, మళ్లీ, వెంకటేశు పెద్దన్న తదితరులు పాల్గొన్నారు…ప్రజా. నేత్ర. న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.