హోసూర్ రోడ్ కాలనీ లో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

హోసూర్ రోడ్ లోనీ 17 వార్డులో కాలనీ వాసులు ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారిని కలిసి కాలనీలో త్రాగునీరు కుళాయిలు, సిసి రోడ్లు, డ్రైనేజీ లేవని చెప్పడం జరిగింది. వారి విజ్ఞప్తి మేరకు కాలనీ లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని వీలైనంత త్వరగా కాలనీలో సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణ కుమార్ గారు, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక గారు, వైఎస్సార్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు,వైఎస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లలిత రామచంద్ర,మాజీ వైస్ యం పి పి పల్లె ప్రతాప్ రెడ్డి, వార్డ్ మెంబర్ కోటి, నారాయణ దాసు మరియు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…ప్రజా. నేత్ర. న్యూస్.మౌలాలి..

Leave A Reply

Your email address will not be published.