సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని…. ఏబీవీపీ డిమాండ్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాగజ్నగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సంధర్బంగా కాగజ్నగర్ లో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉషణా నవీన్ మాట్లాడుతూ
తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల సాకారమైన రోజు సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని డిమాండ్ చేశారు 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న సమయంలో దేశం నడిబొడ్డున ఉన్నటువంటి హైదరాబాద్ రాజ్యంగా పేర్కొన్నా ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో మాత్రం నిజాం నిరంకుశ పాలన నిత్యం భయాందోళనలతో ప్రజలు బ్రతికినవారు స్వాతంత్ర్యం సిద్ధించిన అని వరంగల్లులో మొగిలయ్య అనే దేశభక్తుడు జాతీయ జెండా ఎగురవేసి నందుకు నిజాం రజాకార్ల తుపాకీతో కాల్చి చంపడం జరిగిందని పేర్కొన్నారు
నిజాం నిరంకుశ పాలన వలన తెలంగాణ ప్రాంత ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో మగ్గిపోయారు ఆ సమయంలో తెలంగాణ ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది నిజాం రజాకార్ల ఆగడాలు మితిమీరుతున్న పరిస్థితిని గమనించి ఆనాటి భారతదేశ హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేపట్టిన అటువంటి ఆపరేషన్ పోలో ద్వారా 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడారు అని అన్నారు అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో ఏ విధంగా అయితే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి జాతీయ జెండా ఆవిష్కరణ జరపాలని డిమాండ్ చేశారు అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కే.చంద్రశేఖరరావు గారు నేటి ముఖ్యమంత్రి వర్యులు గంటాపదంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని ఆయన ఆనాడు డిమాండ్ చేశారుమరి ఈరోజు అధికారంలో ఉండి కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక పోవడం సిగ్గుచేటు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు లేనియెడల రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నిద్రపోమని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేసారు..ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి అజయ్.. కార్యకర్తలు అంజన్న సాగర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.