సచివాలయ లలో స్పెషల్ డ్రైవ్ టీకా కార్యక్రమం

ప్యాపిలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ,ప్యాపిలి వైద్యాధికారి డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని సచివాలయ లలో స్పెషల్ డ్రైవ్ టీకా కార్యక్రమం జరుగుతుంది అని తెలిపారు.ఎల్. రాఘవేంద్ర గౌడ్ ఆరోగ్య విద్యా బోధకుడు 8 వ వార్డులో కోవిడు టీకా పైన అవగాహన కల్పిస్తూ 18 సంవత్సరం లు పైబడిన వారు అందరు వేయించు కోవాలి అని ,3 వ విడత లో పిల్లలకు కరోనా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున పిల్లలకు రాకుండా ఉండాలంటే పెద్దలు అందరు 2 డోస్ లు టీకా వేయించు కోవాలి అని తెలిపారు.. 18 సంవత్సరం లోపు పిల్లల పైన ప్రయోగాలు పూర్తి అయిన తర్వాత వేయబడును, కనుక అపోహలు వీడి టీకాను వేయించు కోవాలి, కోవిడు నిబంధనలు సూచనలు, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్ర పరుచుకోవాలి, అని వివరించారు. ఈ కార్య క్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విజయ కుమారి, ఆరోగ్య పర్యవేక్షకులు మనోహర్ రెడ్డి, వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శులు మోద్దీన్ బి , ఆరోగ్య కార్య కర్త రహినబాను, ఆశాలు వార్డ్ వాలేంటర్లు పాల్గొన్నారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.