వైద్య సిబ్బందిని అభినందించిన జడ్పీ సీ ఈ ఓ శోభారాణి..

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మరిని అరికట్టేందుకు మహాదేవపూర్ మండలంలో నిరంతరం పనిచేసి అందరికి వ్యాక్సిన్ వేయడంలో సత్పలితాలు సాధించిన వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు, సిబ్బందిని శుక్రవారం ఎంపీపీ బి.రాణిబాయి రామారావు తో కలిసి జడ్పీ సీ ఈ ఓ శోభారాణి అభినందించి శాలువాతో సన్మానించారు. కోవిడ్ 19 మహమ్మరిని మండలం నుంచి తరిమికొట్టేందుకు మహాదేవపూర్ సీ హెచ్ సీ వారితో పాటు అంబట్ పల్లి, కాళేశ్వరం పీ హెచ్ సీ వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఏ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు గ్రామ గ్రామానా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి 18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేశారని, సంచార బృందాలు గా ఏర్పడి ప్రజల వద్దకే వ్యాక్షన్ తీసుకువెళ్లారని కొనియాడారు. నిత్యం నిరంతరం ప్రజారోగ్యం కోసం పాటుపడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధికారులు సమిష్టి కృషితో ప్రజలందరికీ వ్యాక్షన్ అందించారని అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరుణ శ్రీనివాస్, ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, సర్పంచ్ శ్రీపతి బాపు, ఎంపీఓ ప్రసాద్, డాక్టర్ రవికుమార్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.