రైతులందరూ ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్మన్

రైతులందరూ ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ అన్నారు ఆరుతడి పంటలతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోరైతు ఉత్పత్తి దారుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఆరుతడి పంటలపై రైతులకు జిల్లా జడ్పీ చైర్మన్ అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఇప్పట్లో లేదని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు రంగనాయక సాగర్ రిజర్వాయర్ తో ప్రాంతమంతా సస్యశ్యామలం అయినట్లు తెలిపారు ప్రతి రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలిపారు ప్రభుత్వంఅందిస్తున్న సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్య రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ సర్పంచ్ల పోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు రైతులు పాల్గొన్నారు.. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.