రేవంత్ రెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు

తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఇంటిపై కొంత మంది టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని యూత్ కాంగ్రెస్ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు టిఆర్ఎస్ నాయకులు ఇటువంటి దాడులకు పాల్పడితే తగిన గుణపాఠం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చెపుతారని ఆయన హెచ్చరించారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఇప్పటివరకు పెన్షన్లు జమ కాలేదని అన్నారు దళిత బంధు పేరుతో దళితులను మోసగిస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి రానున్న కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.