మొక్కజొన్న రైతులకు బకాయిలు వెంటనే చెల్లించి ఆదుకోవాలని రాస్తారోకో

విజయనగరం జిల్లా కొమరాడ మండలం మొక్కజొన్న రైతులకు బకాయిలు వెంటనే చెల్లించి ఆదుకోవాలని
కోరుతూ కొమరాడ మండల శివిని కోఆపరేటివ్ బ్యాంకు వద్ద మరియు అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో మొక్కజొన్నను రోడ్డుమీద పారవేస్తూ సీపీఎం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన రాస్తారోకో బుధవారం చేయడం జరిగింది.ఈ ధర్నామరియు రాస్తారోకో ఉద్దేశించి తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు దేవ కోటవెంకటనాయుడు సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాజీ డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు కళింగ మల్లేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొట్నూరు వెంకటనాయుడు మాట్లాడుతూ ఈరోజు విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో మొక్కజొన్న పండించిన రైతులు గాను అన్ని విధాలుగాగిట్టుబాటు ధర కల్పించి ఆదుకునే విధంగా కోమరాడ మండలంలో కొమరాడ సొసైటీ బ్యాంక్ ద్వారా పదిహేను వందల క్వింటాళ్ల శివిని సొసైటీ బ్యాంక్ ద్వారా నాలుగు వేల క్వింటాల్ జియ్యమ్మవలస మండలంలో చినమేరంగి సొసైటీ బ్యాంక్ ద్వారా రెండు వేల క్వింటాళ్లు కురుపాం మండలంలో కురుపాం కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా మరికొన్ని క్వింటాల్ మొక్కజొన్న లను వంద కేజీల 1850 రూపాయలకు కొనుగోలు చేసే పదిహేను రోజులు గడవక ముందే మీ ఖాతాల్లో బ్యాంకులో వేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్క్ పెడ్ సంస్థ ద్వారా మొక్కజొన్న లను రైతులు ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం చాలా గర్వించ దగ్గ విషయమని అయితే దీనికి సంబంధించి గానూ రైతులు మొక్కజొన్న వేసి న రైతులు కొమరాడ మండలంలో శివిని కొమరాడ విజయమ్మ మండలంలో చినమేరంగి కురుపాం మండలంలో కురుపాం కోఆపరేటివ్ బ్యాంకు వద్ద మొక్కజొన్న లు రెండు వంద యాభై మందికి పైగా రైతులు అమ్మడం జరిగిందని.అయితే మొక్కజొన్నలు కొన్నా మార్క్ ఫిడ్ సంస్థ వారు లచ్చయ్యపేట మరియు బలిజిపేట గుడా ౦ లొ నిల్వ చేయడం జరిగిందని అయితే దీనికి సంబంధించి మార్క్ ఫిడ్ వారు 120 రోజులైనా రూపాయి కూడా మొక్కజొన్న రైతులు గాను చెల్లించకపోవడం చాలా అన్యాయమని దీనివల్ల మొక్కజొన్న రైతులు అప్పులపాలై వంద రూపాయలు గానూ మూడు రూపాయల వడ్డీకి తెచ్చుకొని ఇబ్బంది పడే పరిస్థితిలో లబోదిబోమని బ్రతికే పరిస్థితి కనిపిస్తోందని ఎందుకంటే ఈరోజు రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారని ఈ సీజన్లో డబ్బులు రైతులకి చాలా అవసరమైన పరిస్థితి ఉందని ఎందుకంటే వరి నాట్లు నాటే సమయం కావున రైతులతో పాటు వ్యవసాయ కూలీలందరూ బిజీబిజీగా ఉండే సందర్బంలో కూలీ డబ్బులు పొలం పని కి వచ్చిన వారికి వెంటనే ఇస్తే గానీ ఎవరూ వ్యవసాయపనులకి రాని పరిస్థితుల్లో ఇలా రోజులకొలది బకాయిలు రైతులకు ఇవ్వకుండా తిప్పడం చాలా అన్యాయమని ఇలాంటి సందర్భంలో రైతుకు భరోసా బరొసా అని చెపుతున్న ప్రభుత్వం రైతుకి బరొసా ఏదని కావున వెంటనే రైతులకు మొక్కజొన్న ద్వారా రావాల్సిన బకాయిలు వెంటనేస్థానిక డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి గారు గారు స్పందించి జిల్లా స్థాయి అధికారులు మార్క్ ఫీడ్ వారి ద్వారా రైతులకు బకాయిలు చెల్లించి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని లేనియెడల రాబోయే రోజుల్లో రైతులతో కలిసి ఇంకా పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము..ఈ కార్యక్రమంలో దుగి గుణానుపురం సివిని విక్రాంపురం కళ్లికోట రైతులు పాల్గొన్నారు..

.

Leave A Reply

Your email address will not be published.