మూడు గంటలుగా రానాను ప్రశ్నిస్తున్న ఈడీ

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తోపాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్‌, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలకమైన విషయాలు రాబట్టినట్లు సమాచారం. విచారణలో భాగంగా బుధవారం ఉదయం కథానాయకుడు రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.