ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

పాలకులకు ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయమా
కనిపించని అభివృద్ధి పనులు
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే.మున్సిపల్ కమిషనర్.
మున్సిపల్ చైర్మన్ . కౌన్సిలర్.
వారి ఇంటి ముందు వారికి సంబంధించినంతవరకు రోడ్లు బాగా ఉంటాయి కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలను పట్టించుకోరు

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా అచ్చంపేట కొల్లాపూర్ కల్వకుర్తి నాగర్ కర్నూల్ నియోజకవర్గాలలో ఇంద్ర నగర్ కాలనీ రోడ్ నెంబర్ 6 కనిపించని అభివృద్ధి పనులు గుంతలు మోరీలు మరియు రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. పందికొక్కు లకు ఎలుకలకు స్థావరంగా మారిన రోడ్లు మోరీలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు మరియు కౌన్సిలర్లు వచ్చిన నిధులను పక్కదారి పడుతున్నాయ మరి వీరి అకౌంట్లో పోతున్నాయా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు పేరుకు బంగారు తెలంగాణ కనిపించని అభివృద్ధి పనులు ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు పాడైపోయాయి నాణ్యత లేకపోవడంతో ఎక్కడి గుంతలు అక్కడ ఉన్నాయి ఆ గుంతలో పడి చాలావరకు ప్రమాదాలు జరుగుతున్నా కౌన్సిలర్ మున్సిపల్ శాఖ ఇబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారుమరి వీరి పై తగు చర్యలు ఇప్పుడైనా తీసుకుంటారా లేదా వేచి చూద్దాం మరి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఓటేయి చేసేటప్పుడు వచ్చిన కౌన్సిలర్ . ఎమ్మెల్యేలు .ఈ పరిస్థితుల్లో ప్రజలకు అవసరం ఉన్నప్పుడు మాత్రం కనిపించని పరిస్థితి. ఓటు కోసం వచ్చిన నాయకులు ఇప్పుడు మాత్రం ప్రజల సమస్యలు గుర్తుకురాని దౌర్భాగ్య గా ఉంది అని ప్రజలు వాపోతున్నారు ఇప్పుడైనా . రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు రవాణా విషయమై తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు జిల్లా యువజన సంఘాలు

Leave A Reply

Your email address will not be published.