ప్రధానోపాధ్యాయుని సస్పెన్షన్ ఎత్తి వేయాలి – యుటిఎఫ్

ప్యాపిలి సెప్టెంబర్17 (ప్రజనేత్ర న్యూస్): రుద్రవరం మండలంలోని యల్లావత్తుల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిలిపివేసిన విషయాన్ని పలుమార్లు MEO దృష్టికి తీసుకెళ్ళినా సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయకుండా జిల్లా విద్యాధికారులు ప్రధానోపాధ్యాయులను బలిచేయడం సమంజసం కాదని యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ రఘు నాయక్ డిమాండ్ చేశారు.ఈసందర్భంగా ఏనుగుమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏజన్సీ వారు నిలిపి వేసిన విషయం మండల విద్యాధికారి,మండల అభివృద్ధి అధికారికి, మండల రెవిన్యూ అధికారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియపరిచినా, మధ్యాహ్నం భోజనం పథకం కొత్త ఏజెన్సీని ఏర్పాటుపై స్పందించని అధికారులపై చర్యలను తీసుకోకుండా, తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేయడం అన్యాయమని వెంటనే ప్రధానోపాధ్యాయుల సస్పెన్షన్ ఎత్తివేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కృష్ణా నాయక్,నాగాంజనేయులు,కృష్ణ మోహన్,నాగ మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.