ప్రజలుకు,అవగాహన కార్యక్రమంవిద్యార్థులకు ఐరన్ మాత్రలు పంపిణీ

ప్యాపిలి  వైద్యాధికారి డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ ఆదేశాల మేరకు ప్యాపిలి మండలం లోని ఏనుగుమర్రి గ్రామములో పంచాయతీ కార్యదర్శి పార్వతమ్మ, ఆరోగ్య విద్యా బోధకుడు ఎల్. రాఘవేంద్ర గౌడ్ వారు మాట్లాడుతూ 30 సంవత్సరములు పైబడిన వారు అందరూ 104 వాహనము ఊరి కి వచ్చినపుడు బీ పి, సుగర్ పరీక్షలు తప్పకుండా చేయించు కోవాలి, మందులు క్రమము తప్పక వాడాలి పొగాకు ఉత్పత్తులు వాడడము వలన ఓరల్ , ఈశో పెగుస్, ఊపిరి తితుల్ల క్యాన్సర్ వస్తాయి కాబట్టి చుట్ట, బీడీ, చిగారెట్, పన్ పరాగ్,వంటి పొగాకు ఉత్పత్తులు లను వాడకూడదు. డెంగ్యు, మలేరియా టైపాయిడు డయేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, మన ఊరిలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు పెరగకుండా చూసుకోవాలి, కాసి చల్లార్చిన వడబోసిన నీటిని త్రాగాలి. నీటికి క్లోరినేషన్ ప్రతి రోజూ చేయాలి, వేడివేడి ఆహార పదార్థాలు భుజించాలి. మరియు 18 సంవత్సరములు పైబడి న వారు అందరూ కరోనా టీకా వేయించు కోవడం వలన 3వ విడత కరోనా ను ఎదుర్కొన వచ్చును అని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూగా చేతులు శుభ్ర పరుచుకోవాలని వివరించారు.. పిల్లలకు విప్స్ (Wifs-weekly iron folic suplamentation)ద్వారా ఐరను మాత్రలు ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో హెచ్ ఎం షెక్షా వలి, ఆరోగ్య కార్యకర్త రంగమ్మ, నరసింహయ్య, విజయలక్ష్మి, ఆశా గీతాంజలి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
? ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.