పాఠశాల తల్లి దండ్రుల కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ప్యాపిలి :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రాష్ట్ర ఉన్నత విద్య శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి.
పాఠశాల తల్లి దండ్రుల కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు అబ్దుల్ లతీఫ్. వారు మాట్లాడుతూ
ప్యాపలి మండల పరిధిలోని ఓబుల దేవర పల్లి ప్రాథమిక పాఠశాలలో తల్లి దండ్రుల కమిటీ ఎన్నికల కు నోటిఫికేషన్ ఉదయం విడుదల చేయడంజరిగింది.
నోటిఫికేషన్ వివరాలతోపాటు ఓటుహక్కు కలిగిన తల్లిదండ్రుల జాబితా నోటీస్ బోర్డుపై ఉంచారు. పాఠశాల లో మొత్తం 39 మంది విద్యార్థులు ఉండగా 26 మందికి మాత్రమే ఓటు హక్కు నిర్ధారించడమైనది. ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే 20.09.2021 లోపు తెలియచేస్తే తుది జాబితా 20.09.2021 న ప్రకటించి 22.09.2021 న ఉదయం తరగతికి 3 చొప్పున (ఇద్దరు మహిళలు,ఒక పురుషుడు) అందులో ఒకరు SC లేదా ST,ఒకరు BC,ఒకరు OC ఉండేలా మొత్తం 15 మందిని ఎన్నుకుంటారు.అదేరోజు మధ్యాహ్నం ఎన్నిక కాబడిన 15 మందిలో నుండి ఒకరిని చైర్మన్ గాను మరొకరిని వైస్ చైర్మన్ గాను ఎన్నుకుంటారు. ఎన్నిక అనంతరం ప్రమాణ స్వీకారం చేయించడం జరుగును అని పాఠశాల కి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రుల కు తెలియ చేశారు.
🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.