కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ మరియు పిన్నింటి అనిల్ రావు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం

పర్వతగిరి మండల కేంద్రంలో పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ మరియు పిన్నింటి అనిల్ రావు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం, సిడిఎం ,ఎమ్మార్పీఎస్ ,ఆర్ ఎస్ పి అంబేద్కర్ సంఘం తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు.కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని నూతన విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించాలని దళిత బంధు రాష్ట్రమంతటా అమలు చేయాలని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ ఈ నెల 27 న జరిగే అఖిల పక్ష బంద్ ను జయప్రదం చేయలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరయ్య సిడిఎం మండల కార్యదర్శి మాదాసి యాకుబ్ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మాసాని గోపాల్ ఆర్ ఎస్ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్ సిపిఎం జిల్లా నాయకులు ఈదునూరు వెంకన్న, యూత్ కాంగ్రెస్ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్, యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము రమేష్ ,పర్వతగిరి పట్టణ అధ్యక్షులు దారం పూర్ణచందర్, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ నరుకుడు రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేచినేని మోహన్ రావు, ఆబర్ల రవి, లచ్చు నాయక్, జనగం వెంకన్న, పంతులు, రంగు వెంకన్న అజయ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.