వంద పడకల ఆసుపత్రిలో ఐ సీ యూ ప్రారంభం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో పది పడకల ఐసియూ బ్లాక్ ను వర్చువల్ పద్ధతిలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎన్ఆర్ఐలు మరియు నేరుగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి లు ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన నిర్మాణ్ ఆర్గనైజేషన్ ద్వారా కాటారం మండలం బొప్పారం గ్రామానికి చెందిన ప్రవాసాంద్రులు ఉరునందు కిషోర్ రావు, సుశాన్ రావు దంపతులు మరియు ఇండో అమెరికన్ చారిటీ యుఎస్ఏ సతీష్ ఎల్లంకి ల సహకారంతో జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో వెంటిలేటర్ తదితర అత్యవసర వసతులతో ఏర్పాటుచేసిన ఐసియు ను మంగళవారం ఆయా ప్రాంతాల నుండి ఎన్ఆర్ఐలు మరియు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వర్చువల్ పద్ధతిలో ఐసియూ వార్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనగా శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గెం వెంకటరాణి, డిసిహెచ్ ఎస్ డాక్టర్.తిరుపతిలు నేరుగా వంద పడకల ఆసుపత్రిలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మరియు శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ఈ జిల్లాలో నిరుపేదలకు వైద్య సౌకర్యాల కల్పనకు ముందుకు వచ్చి పది పడకలతో అన్ని రకాల అత్యవసర వైద్య సౌకర్యాలను కల్పిస్తూ ఐసీయూ ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ జిల్లా ప్రజలు మీ సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.