హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్

హైద‌రాబాద్ : హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును ఖ‌రారు చేస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. ద‌ళిత బంధు ప్రారంభ స‌మావేశం సంద‌ర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్‌లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను నియోజక‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ ప‌రిచ‌యం చేయ‌నున్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్ రావు పేరును ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు గులాబీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.