స.హ.చట్టాన్ని నీరుగారుస్తున్న అధికారులు

రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో తేదీ 01 అక్టోబర్ 2020 , 21 డిసెంబర్ 2020 , 23 పిబ్రవరి 2021,10 పిబ్రవరి 2021, 30 జూలై 2021 , 23 జూలై 2021 రోజున పలు మార్లు సమాచారం మేరకు దరాఖాస్తు చెసుకున్నాను.ఇప్పటి వరకు కార్యాలయాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా సదురు ప్రజా సమాచార అధికారి ఇబ్బందులకు గురిచేస్తూన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం నిర్ణీత సమయంలో పౌరులకు కావాల్సిన సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా సమాచారం అందించాలి.భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలే వారికి యజమానులు.
వారితో పనిచేయించుకోవడం పౌరుల హక్కు. ప్రజలకు జవాబుదారిగా పనిచేయడం ప్రభుత్వ అధికారుల కర్తవ్యం. దరఖాస్తులకు సమాచారం అందివ్వకుండా అధికారులు తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు.ప్రభుత్వ అధికారుల నిర్లక్షానికి నిదర్శనం సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా,దరఖాస్తుదార్లను ఇబ్బందులకు గురిచేసినా సంబంధిత అధికారులపైన చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ అధ్యక్షులు పసుపు వెంకట.తాట్ల. వీరేశం. జమాల్.ముజాఫర్. తదితరులు పాల్గొన్నారు..
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.