సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను పర్శీలించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
పత్తికొండ కొత్త బస్టాండ్ ప్రాంతంలో కోటిన్నర వ్యయంతో పూర్తి చేసిన సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు పరిశీలించారు. ప్రజా అవసరాలు తెలుసుకునేందుకు పలు కాలనీలలో పంచాయతీ ఈఓ కృష్ణ కుమార్, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసులు తో కలిసి పర్యటించారు. స్థానిక శివ సాయి నగర్, నాయి బ్రాహ్మణ కాలనీలో డ్రైనేజీ, రోడ్డు సమస్యలు పరిశీలించారు. వీలైనంత త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని కాలనీవాసులకు ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు హామీ ఇచ్చారు…..ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి