సహకారం సంఘం ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని సహకారం సంఘానికి జరిగిన ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరచిన అభ్యర్థి సొంటకే శంకర్ 20 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పోలైన 112 ఓట్లలో 2 ఓట్లు చెళ్లనివి ఉండగా 66 ఓట్లతో సొంటకే శంకర్ మెజార్టీ ఓట్లతో గెలుపొందారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే మానాజీ, మండల అధ్యక్షులు గోసుల నాగరాజు, వైస్ ఎంపిపి పోరెడ్డి శ్రీనివాస్,సర్పంచ్ లు నందిశ్వర్, అడే శ్రీరాం, mptc గజనంద్, సొసైటీ డైరెక్టర్ లు చట్ల వినీల్, నిరాడి లింగన్న, OBC జిల్లా ఉపాధ్యక్షులు కేవల్ సింగ్, సోషల్ మీడియా కన్వీనర్ గాజుల రాకేష్ లు పాల్గొన్నారు.