సమాచార హక్కు చట్టం – 2005 పై అవగాహన సదస్సు

కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం – 2005 సొసైటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం -2005 పైన అవగహన సదస్సు నిర్వహించారు. MCR H RD జిల్లా ట్రైనర్ అష్రాఫ్ సహచట్టం పైన అవగాహన కలిపించారు.అనంతరం సమాచార హక్కు రక్షణ చట్టం-2005 సొసైటీ కౌటల మండల నూతన కమిటీని డివిజన్ ఇంచార్జ్ Md కబీర్ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ సెక్రెటరీ ఇగురపు ఇంద్రసేన్,ప్రచార కార్యదర్శి గజేల్లి సందీప్, జిల్లా లీగల్ అడ్వైజర్ ధీరజ్ లు ఎన్నుకొని, నూతన సభ్యులకు నియామక పత్రలను అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సామాన్యుని వజ్రాయుధం అని, సమాచార హక్కు చట్టం తోనే పారదర్శకత, జవాబుదారీ తనం సాధ్యమన్నారు.సమాచార హక్కు చట్టం పైన అవగాహన కలిపించడంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ కార్యకర్తలు సైనికునిల పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యంగుల జిల్లా అధ్యక్షులు ఇప్ప శంకర్, రాజు,వినోద్ లతో పాటు మండల యువకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.