వెల్దుర్తి గ్రామంలో పత్తి పంటపై పొలం బడి కార్యక్రమం

కర్నూలుజిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మి రెడ్డి పల్లె గ్రామము మరియు వెల్దుర్తి గ్రామంలో పత్తి పంటపై పొలం బడి కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో 30 మంది రైతులు వుంటారు.వారిలో ఒకరి పొలంలో పొలం బడి కార్యక్రమం నిర్వహించబడును.2 ఎకరముల పొలాన్ని 3 భాగాలుగా విభజించి మొదటి అర్ధ ఎకరాల్లో ipm పద్దతిలో అనగ పక్షి స్థావరాలు,పెరపోన్ ట్రాప్స్,బంక అట్టలు, రెండవ భాగమును ఒక ఏకరగ విభజించి అందులో 4 లేక 5 రకముల వితనములు మరియు రసాయనిక ఎరువులు మోతాదులో తేడాలు మరియు అర్ధ ఎకరములో రైత్వరి పద్దతిలో సాగు చేస్తారు.ఎ రైతు పొలంలో పొలం బడి నిర్వహిస్తామో అతనిని కొల్లాబరేటర్ అంటారు.పొలం బడి ముఖ్య ఉద్దేశాలు 1.రైతును స్వయం నిర్ణేతలుగ మార్చటం .2.తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి సాధించడం.3.మిత్ర పురుగులను రక్షించడం.4.భూమిని పాడుకాకుండ చూడటం.ఈ కార్యక్రమంలో డోన్ ADA పి.అశోక్ వర్ధన్ రెడ్డి సార్ మరియు AEO లు తస్లిమ్,రాధ,VAAలు సుధీర్ కుమార్ రెడ్డి ప్రేమీల, బొమ్మో రెడ్డి పల్లె మరియు వెల్దుర్తి రైతులు పాల్గొనడం జరిగింది..ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.