విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి సి ఐ టి యు ఆధ్వర్యంలో  కోడూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా!!

కడప జిల్లా రైల్వే కోడూరు లో మంగళవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద  సీఐటీయూ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప స్టీల్ ప్లాంట్ ను విభజన చట్టం  హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం  శైలు  ఆధ్వర్యంలో  నిర్మించాలని, ఢిల్లీ లో జరుగుతున్న జంతర్ మంతర్  ఐక్య కార్యాచరణ కార్మికుల ధర్నాకు మద్దతుగా, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, అని పోరాడి 36 మంది త్యాగ ఫలితంగా, అనేక నిర్బంధాలను ఎదుర్కొని, సాధించిన   ఉక్కు పరిశ్రమను, ప్రవేట్ పరం చేయడానికి, అమ్మడానికి, బిజెపి నాయకులకు ఎవరిచ్చారు అధికారం అని ప్రశ్నించారు, 100 కోట్లు లాభంలో ఉన్నది, రెండు లక్షల కోట్ల విలువైన  ఆస్తులను, విదేశీ బహుళజాతి కంపెనీ ఉత్తర కొరియా  పోస్కో కంపెనీకి,  కారుచౌకగా అమ్మేస్తున్నారు అని, లక్షలాదిమంది ఉపాధి కోల్పోతారని తెలిపారు.  దేశంలో బిజెపి ప్రభుత్వం, ప్రజలు ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సంస్థలను,   ఆ దాని ,అంబానీ, రిలయన్స్ స్వదేశ్ పెట్టుబడిదారులకు, దోపిడీ చేసుకోవడానికి  కట్ట పెడుతున్నారన్నారు. అందులో భాగమే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వందల రెట్లు పెంచి  ప్రజలపై భారాలు  మోపారు అన్నారు. కార్మిక చట్టాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారని, రైతు చట్టాలు కార్పొరేట్లకు అనుకూలంగా మార్చారని, విద్యుత్ సవరణ చట్టం చేసి, ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రజల , రైతుల పైన  భారాలు  పడతాయి అన్నారు. రైల్వేలు, పోర్టులు, ఎయిర్పోర్టులో,  బ్యాంకులు, ఎల్ ఐ సి లు, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, గనులు,  ఆఖరికి రక్షణ రంగం, అన్ని ప్రైవేటు కార్పొరేట్లకు,  కట్టబెట్టి  దేశ ద్రోహానికి  పాల్పడుతున్నారన్నారు వెనుకబడిన రాయలసీమ లో కడప ఉక్కు పరిశ్రమ కేంద్రం ఆధ్వర్యంలో విభజన చట్టం  ప్రకారం, నిర్మించాలని డిమాండ్ చేశారు.  చంద్రబాబు, కడప ఉక్కు శిలాఫలకం వేశారని ,మోహన్ రెడ్డి,  35 కోట్లు, ఏపీఎండీసీ డబ్బులతో, చదును చేస్తున్నారన్నారు, కేంద్రం నిధులతోనే  పరిశ్రమ   స్థాపించాలి అన్నారు. అదేవిధంగా,విశాఖ ఉక్కు, అమ్మడానికి వీడెవడు, కొనడానికి వాడెవడు, నిలదీశారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు, రాయలసీమ హక్కు, అని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ గంగాపూర్ సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, సిగే .చెన్నయ్య, జిల్లా కార్యదర్శి  పందికాళ్ళ మణి,  బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు, లింగాల యానాదయ్య ,యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రెగ్యులర్ యూనియన్  జిల్లా,నాయకులు,  సి.పుల్లయ్య, కనపర్తి కిరణ్ కుమార్, విద్యుత్ కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు, పొద్దుటూరు కృష్ణారెడ్డి, ఏపీఎం డి సి, ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి  నారదాసు సుబ్బారాయుడు,  మంగంపేట మైనింగ్ వర్కర్స్ యూనియన్ త్రివేణి కంపెనీ నాయకులు, సురేంద్ర, సుధాకర్, ఏపీఎండీసీ సీనియర్  మాజీ  కార్యదర్శి కార్మిక నాయకుడు,  యానాది, మోడీ ఎల్లయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘ నాయకులు, తుపాకుల హరిప్రసాద్, నాగేశ్వరరావు, పుల్లంపేట  సి ఐ టి యు నాయకులు, దార్ల  నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం  ఓబులవారిపల్లె మండల కార్యదర్శి, ఎం. జయరామయ్య,  కేశవులు,  ఆంధ్ర ప్రదేశ్,రైతు సంఘం  ఓబులవారిపల్లి నాయకులు, ఎర్ర సుబ్రహ్మణ్యం,  కోడూరు మండల రైతు సంఘం నాయకులు,  సుబ్బారాజు,  వడ్డే వెంకటయ్య, కె వి పి ఎస్, డివిజన్ కన్వీనర్, ఓబిలి .పెంచలయ్య, నరసింహులు,  నాగరాజు, డివైఎఫ్ఐ, మండల కన్వీనర్,  కర్ర తోటి హరి నారాయణ. తదితరులు పాల్గొన్నారు. అనంతరం తాసిల్దార్ శిరీష మేడం గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.