వింజమూరు వైసీపీ మండల కన్వీనర్ గా మద్దూరు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

వింజమూరు వైసీపీ మండల కన్వీనర్ గా మద్దూరు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ని ఎంపిక చేసినట్లు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం చరవాణి ద్వారా విలేకరులతో మాట్లాడుతూ మండల నాయకుల అభిప్రాయం మేరకు వైసీపీ పార్టీకి విశిష్ట సేవలు అందించిన మద్దూరు ప్రసాద్ రెడ్డి ని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. కనుక మండల నాయకులు కార్యకర్తలు ఆయనను అనుసరించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మద్దూరు మాట్లాడుతూ పార్టీలో సీనియర్ గా ఉన్న నన్ను గుర్తించి నాకు సముచిత స్థానం ఇచ్చినందుకు ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి మరియు మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు జిల్లా ఎమ్మెల్యేలకు నాయకులకు మండల నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నా పై గౌరవంతో ఇచ్చిన ఈ గురుతర బాధ్యతను వమ్ము చేయక పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.