లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల దినోత్సవం

ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం డోన్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ బాలచంద్రారెడ్డి తల్లిపాలు ఇవ్వటాన్ని ప్రోత్సహించండి ఇది మనందరి బాధ్యత అనే నినాదంతో ప్రజల ముందుకు తీసుకువెళ్ళుతున్నట్లు ఆయన చెప్పారు,నవజాత శిశువుకు అవసరమైన పోషకాలను ఇవ్వడానికి తల్లిపాలను ఉత్తమ మార్గము, వ్యాధి మరియు సంక్రమణ నుండి పిల్లలను రక్షించే జీర్ణమయ్యే ప్రోటీన్లను మరియు సహజ రోగనిరోధక శక్తి తో తల్లిపాలు చాలా పోషక మైనవి. తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం అని చెప్పారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సుంకన్న యాదవ్ లయన్స్ క్లబ్ డోన్ అధ్యక్షులు మాట్లాడుతూ డబ్బా పాలు వద్దు….. తల్లిపాలే ముద్దని ఆయన తెలిపారు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలురకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. సాధారణ మరియు సి సెక్షన్ డెలివరీ రెండింటిలోను డెలివరీ అయిన ఒక గంటలోపు తల్లి తమ బిడ్డకు తప్పకుండా పాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది తల్లికి మరియు బిడ్డకు ఆరోగ్యకరం అని ఆయన చెప్పారు, శిశువులకు ఆరు నెలల పాటు తల్లిపాలు తప్పకుండా పట్టాలనే వైద్యులు సూచించిన కూడా చాలామంది పెడచెవిన పెడుతున్నారు అని ఆయన అన్నారు. మరియు లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ పౌష్టికాహారం తల్లిపాలే, సంపూర్ణ ఆరోగ్యంగా పుట్టిన పిల్లలకు వెంటనే తల్లిపాలు ఇవ్వడం తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యుడు నీలం ప్రభాకర్ యాదవ్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది సాధారణ కాన్పు మరియు సి సెక్షన్ డెలివరీ అయినా, మరియు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.
? ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.