రోడ్డును పరిశీలించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని మోర్లి గూడ గ్రామానికి వెల్లే రోడ్డును పరిశీలించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ గారు
దహేగం రోడ్డు నుండి మోర్లి గూడా గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి .
TRS పార్టీ అధికారంలోకి వచ్చి 7 సం// రాలు గడిచిన కనీసం రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉండడం TRS ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అని రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా గా చేస్తాం అని చెప్పిన కేసీఆర్ గారు మోర్లి గూడా గ్రామం కనిపించడం లేదా అని ఏద్దెవ చేశాస్తూ ఎక్కడ నీ బంగారు తెలంగాణా మాయమాటలతో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేస్తున్నారు.సిర్పూర్ MLA కనీసం ఈ గ్రామాన్ని ఒక్కసారైనా సందర్శించక పోవడం పై ప్రజలపై MLA కున్న ప్రేమ ఎలాంటిదో అర్ధమౌతుందని కేవలం కొనప్పగారు ఓట్ల కోసమే ఈ గ్రామానికి వెళ్లి తరువాత మోర్లి గూడాను మరచి పోతున్నారు 3 సార్లు MLA అని డప్పు కొట్టుకోవడం కాదని ప్రజల అవసరాలు తీర్చాలని ఎద్దేవా చేశారు త్వరలో సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిస్కారించకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర స్థాయిలో ప్రతిగతిస్తాం అని డిమాండ్ చేశారు…
కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంటెంకీ సురేష్ గారు,సింగం నగేష్ గారు ,ఎస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ,ఎస్సి మోర్చా అధ్యక్షులు నాగేందర్ గారు ,గిరిజన మోర్చా అధ్యక్షులు కొమురం లక్ష్మణ్ గారు కార్యకర్తలు పాల్గొన్నారు….ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.