రేషన్ షాపుల్లో, వ్యాక్సిన్ సెంటర్స్ లో మోడీ ఫోటో పెట్టాలి… బిజెపి

ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామం లో బిజెపి మండల అధ్యక్షులు దామోదర్ నాయుడు అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యకక్రమానికి ముఖ్య అతిదిగా పాల్గొన్న మండల విస్తారక్ బిజ్జం సుబ్బారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకిత భావము తో పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీద్వారా వచ్చే సంక్షేమ పథకాలపై అవగాహనా పెంపొందించుకొని ప్రజలకుతెలియజేయాలన్నారు.అలాగే మన పార్టీ ద్వారా వచ్చే పథకాలపై మండలకార్యాలయాల్లోను, రేషన్ షాపుల్లోనూ, వాక్సినేషన్ సెంటర్ల లోనూ నరేంద్ర మోడీ ఫోటో ఉండేలా చూడాలన్నారు.. దీనిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. మన ప్రభుత్వం రైతులకోసం చేపడుతున్న విత్తనాలసబ్సిడీ, ఫసల్ బీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలనిర్వహణ, వ్యవసాయచట్టాలపై కూడా అవగాహనచెయ్యాలని సూచించారు. అనంతరం దామోదర్ మాట్లాడుతూ త్వరలో మండల కార్యవర్గాన్ని, మోర్చా కమిటీ లను, బూత్ కమిటీ మరియు శక్తి కేంద్రాలు పూర్తి చేసి కార్యకర్తల సహకారం తో పార్టీబలోపేతానికి కృషి చేస్తా మన్నారు. తదనంతరం బిజెపి అసెంబ్లీ నాయకుడు మద్దిలేటి మాట్లాడుతూ ఢోన్ అసెంబ్లీలోపార్టీ ని బలోపేతము చేసి కాషాయ జెండా ఎగిరేసే వరకు అలుపెరుగనిపోరాటం చేద్దామని కార్యకర్తల్లో ఉత్సాహా న్ని నూరిపోశారు.. ఈ కార్యక్రమం లో చాంద్ బాషా, ఓబన్న, శంకర్, మల్లయ్య, ఎల్లయ్య పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.