రక్తదాత – సుఖీభవ
జీ. కొట్టాలకు చెందిన కౌలుట్లయ్య అనే వ్యక్తి ఎనీమియా ప్రాబ్లం తో బాధపడుతూ రక్తం చాలా తక్కువ ఉన్నది ఆయనకు రక్తం అవసరం అని గ్రూప్ లో పోస్ట్ చూసి వెంటనే స్పందించిన ద్రోణాచలం సేవా సైనికుడు రక్తమిత్ర తిరుపాల్ తన B+Ve రక్తాన్ని నవ్య హాస్పిటల్ నందు 12 వసారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. చిన్న వయసులోనే 12 వ సారి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం అని పలువురు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్,వెంకటస్వామి,అజయ్ కుమార్ లు పాల్గొన్నారు.ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి.