మహిళలపై జరుగుతున్నా దాడులు ఖండించాలీ తహశీల్దార్ కి వినతిపత్రం
విజయనగరం జిల్లా. కోమరడా మండలం మహిళలపై జరుగుతున్నా దాడులు ఖండించండి
అని కోరుతూ కొమరాడ తహశీల్దార్ కార్యాలయంవద్ద ఐద్వా సిఐటియు ఆధ్వర్యాన నిరసన బుధవారం జరిగింది.నిరసన అనంతరం తహసీల్దార్ ఎస్ ఎల్వీ ప్రసాద్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
అనంతరం ఐద్వా నాయకులు రెడ్డి మాణిక్యం సీఐటీయూ నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ!
ఈ రోజు రాష్ట్రంలో మహిళలపై ప్రతిరోజూ దాడులు విపరీతంగా జరిగే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చట్టాల వల్ల కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని
ఇలాంటి సందర్బంలో గుంటూరు జిల్లాలో వరుసగా జరుగుతున్న మహిళలపై దాడులు చాలా అన్యాయమని అలాగే ఈ రోజు . కొద్ది నెలల క్రితం రాజధానిలో సీఎం నివాసానికి దగ్గరలో దళిత యువతిపై ప్రియుడు ఎదుటే ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఇప్పటి వరకు నిందుతుడ్ని అరెస్టు చేయలేక పోవడం చాలా అన్యాయమని అలాగే ఈ నెల 15 వ తేదీన గుంటూరు నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై బీటెక్ విద్యార్థినిని శశికృష్ణ అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారని అన్నారు.
ఇలాంటి సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన దిశాచట్టం ఉన్నా ప్రకటనకే తప్పా ఆచరణలో సాధ్యం కావడం లేదని పెంచే దిశగా కనిపిస్తుందని అన్నారు.
ఈరోజు విచ్చలవిడిగా అశ్లీలత,నీలిరంగు చిత్రాలు సెల్ ఫోన్లలో ఎక్కువ వాడకం జరగడంతో మహిళలపై దాడులు జరగడం ఒక నిదర్శనమని కావున వాటిని నియంత్రించడములో ప్రభుత్వాలు చొరవచూపడంలేదని అన్నారు.ఏవైతే మహిళల కోసం ఏర్పాటు చేసిన చట్టాలన్ని చిత్తశుధ్ధితో అమలు చేయాలని
అప్పుడే మహిళలకు సరైన రక్షణ ఉంటుందని అన్నారుఈ కార్యక్రమంలో దుర్గ లక్ష్మి పాల్గొన్నారు.రిపోటర్. శ్యామ్.