మధిర మండలం మిర్చి నర్సరీల్లో టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు.

మిర్చి నర్సరీలో మొక్క నాణ్యత లేని, కల్తీ విత్తనాల నారును రైతులకు అంటగట్టకుండా నిరంతరం తనిఖీలు చేయడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీ బృందాలను జిల్లా వ్యవసాయ,హార్టికల్చర్ శాఖల సమన్వయంతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.అందులో భాగంగా మధిర మండలంలోని పలు నర్సరీల్లో నియోజకవర్గ హార్టికల్చర్ అధికారి వేణు తో కలిసి టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టింది.ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ..గతంలో కొన్ని రకాల విత్తనాలు మొలకెత్తక, కొన్నేమో నకిలీ హైబ్రిడ్‌ విత్తనాలు, జన్యుపరమైన తేడాలతో పంటల దిగుబడి రాక అన్నదాతలు ఇబ్బందులకు గురైనారు. దీంతో ఈ ఏడాది వ్యవసాయ,హర్టికల్చర్ శాఖ ల అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తమైనట్లు తెలిపారు.దీనిలో భాగంగానే మిర్చి నర్సరీలు తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు…!!

Leave A Reply

Your email address will not be published.