భూరికార్డులను సక్రమంగా నిర్వహించాలి.

జయశంకర్ భూపాలపల్లి భూమి రికార్డులను నిర్వహించడం రెవెన్యూ శాఖ ప్రధాన విధి అని భూమి రికార్డులను క్రమ పద్ధతిలో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆర్డీవో కార్యాలయ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా భూపాలపల్లి ఆర్డిఓ కార్యాలయంను సందర్శించి భూ రికార్డులను భద్రపరిచిన తీరును పరిశీలించారు. అనంతరం ఆర్డీవో ఛాంబర్లో ఆర్డీవో కార్యాలయ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే భూసంబంధ అంశాలను పర్యవేక్షించడం భూమి, రికార్డు లను భద్రపరచడం అని ఆర్డీవో కార్యాలయంలో గల రికార్డులను ఒక అంశానికి సంబంధించిన ఫైళ్ళను సంవత్సరాలు, సెక్షన్ల వారీగా క్రమపద్ధతిలో క్రోడీకరించి ఆన్లైన్లో పొందుపరిచి మాన్యువల్ రికార్డులను క్రమపద్ధతిలో భద్రపరచాలని అన్నారు. అలాగే ఆర్డిఓ కార్యాలయంతో పాటు జిల్లాలోని 11 తాసిల్దార్ కార్యాలయాల్లోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందరూ ఈ అటెండెన్స్ ఆప్ లో నమోదై కచ్చితంగా ప్రతిరోజు ఈ అటెండెన్స్ ఆప్ లో హాజరు వేసుకోవాలని, హాజరు శాతాన్ని ఆర్డిఓ మరియు తాసిల్దార్లు ప్రతిరోజు పర్యవేక్షించాలని అన్నారు.జాతీయ రహదారి నిర్మాణం, సింగరేణి, జెన్కో సంస్థలకు అవసరమైన భూసేకరణ అంశాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రభుత్వ నిబంధనల మేరకు భూ నిర్వాసితులకు సకాలంలో నష్ట పరిహారం అందించి గ్రామసభలు ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా భూసేకరణ వేగవంతం చేయాలని అన్నారు. ముఖ్యంగా మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో ఇప్పటివరకు ఎంత భూమిని సేకరించారని అడగగా ఇప్పటివరకు టేకుమట్ల మండలంలో అవసరమైన భూసేకరణ పూర్తయిందని, చిట్యాల మండలం నవాబుపేట లో ప్రస్తుతం భూ సేకరణ జరుగుతుందని త్వరలోనే మొగుళ్లపల్లి మండలంలో భూ సేకరణ పూర్తిచేస్తామని ఆర్డిఓ శ్రీనివాస్ తెలిపారు. జంగేడు గ్రామంలో జెన్కోకు అవసరమైన భూమి మరియు సింగరేణికి అవసరమైన 330 ఎకరాలు మరియు 520 ఎకరాల భూమికి సంబంధించిన భూ సేకరణ వేగవంతం చేయాలని, అవసరమైతే భూమి యజమానులు మరియు కాస్తుదారులు, రెవెన్యూ ,సర్వే, సింగరేణి సంస్థల అధికారులుతో సమావేశం నిర్వహించి క్షేత్ర పర్యటన చేసి వారం రోజుల్లోగా సేకరణ పూర్తి చేయాలని అన్నారు. కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన పెండింగ్లో ఉన్న 400 ఎకరాల భూసేకరణను గ్రామ సభల ద్వారా సేకరించాలని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపుకు గురవుతున్న మేడిగడ్డ, అన్నారం గ్రామాల పంట భూములకు సంబంధించిన వివరాలను ఇరిగేషన్ ఈఈ ద్వారా సేకరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కార్యాలయం ఏవో సుమన్, భూపాలపల్లి తాసిల్దార్ ఇక్బాల్, ఆర్డీవో కార్యాలయ వివిధ సెక్షన్ల అధికారులు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ కాటారం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భూమి రికార్డులను మరియు అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ధరణి కార్యక్రమం ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ తదితర కార్యక్రమాలను జాప్యం లేకుండా రైతులకు లబ్ది కలిగేలా త్వరగా నిర్వహించాలని అలాగే కార్యాలయ సిబ్బంది అందరూ తప్పకుండా అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని, ఈ ఆఫీసు పద్ధతిలో ఫైళ్ల నిర్వహణ చేయాలని తాసిల్దార్ శ్రీనివాస్ ను, డిప్యూటీ తాసిల్దార్ రామ్మోహన్ ను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.