ప్రాథమిక తరగతులను విభజించడం తగదు

ప్యాపిలి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(FAPTO)
నూతన విద్యావిధానం 2020 పేరుతో ప్రాథమిక పాఠశాలలలో ఉన్న విద్యార్థులను విభజించడం అన్యాయం అని FAPTO నాయకులు నరసింహారెడ్డి, అబ్దుల్ల తీఫ్,అంజనప్ప అభిప్రాయపడ్డారు.సర్క్యులర్ 172 ను తీసుకొని వచ్చి ప్రాధమిక పాఠశాలలలో ఉన్న 3,4,5 తరగతులను 250 మీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలలో కలపడం సముచితం కాదని వారు అన్నారు.ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(FAPTO) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయులు అందరూ నల్ల బ్యాడ్జి లు ధరించి పాఠశాల విధులకు హాజరయ్యారని భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,హుస్సేనాపురం జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల,పట్టణంలోని కింది గేరి ప్రాథమిక పాఠశాల,OD పల్లిప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్క్యులర్ 172 ని రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్ నాయక్,లక్ష్మి నాయక్,శ్రీధర్ రాజు,సుధాకర్,సుధా పరిమళ తదితరులు పాల్గొన్నారు.

🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.