ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికెషన్లు విడుదల కొరకై ఆంజనేయస్వామి దేవాలయంలో విన్నతి పత్రం 

ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికషన్లు విడుదల కొరకై ఊర్కోండపేట లో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో వినతి పత్రం సమర్పిస్తు నిరసన వ్యక్తం చేయటం జరిగింది.కార్యక్రమంలో BJYM మండల అధ్యక్షులు టీ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరం… రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని నిరుద్యోగ భృతి చెల్లించాలని వందల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ భగవంతుడన్న కొంత బుద్దిని ప్రసాదించాలని కోరుతూ నిరుద్యోగుల ఆవేదనను తెలియజేస్తూ వినతి పత్రాన్ని సమర్పించటం జరిగింది ఈ కార్యక్రమంలో BJP మండల ఉపాధ్యక్షుడు కృష్ణ ఆంజనేయులు బీజేవైఎం కార్యకర్తలు k శివ B శివ కుమార్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.