ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

ప్యాపిలి పట్టణంలో ఏకలవ్య సర్కిల్ నందు ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఎరుకలజాతి బిడ్డలందరూ ఒకే తాటిపై నివ్వాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎరుకల జాతి కి తీవ్ర అన్యాయం జరిగింది. నామినేటెడ్ పోస్టులలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎరుకల బిడ్డలకు ఒక్క నామినేటెడ్ పదవి కూడా రాకపోవడం చాలా బాధాకరం. కావున ఇకనైనా స్పందించి రాయలసీమ ప్రాంతానికి ఒక నామినేటెడ్ పోస్టులు అయినా ఇస్తారని ఎంతో నమ్మకం గా ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఏ.పీ.వై.ఎస్.ఎస్ .కర్నూలు జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సి.హెచ్.బాలకృష్ణ. మండల కమిటీ అధ్యక్షులు ఎం.శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి సి.శ్రీనివాసులు కో ఆప్షన్ సభ్యుడు సి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.