ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ లో నమోదు కై తరలివచ్చిన నిరుద్యోగులు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్: హైదరాబాద్ లో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే 3 నెలల గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ లో నమోదవడానికి మరికొంతమంది నిరుద్యోగులు ఆసక్తి చూపారు. వారందరికీ భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు అభినందనలు తెలియజేస్తూ 3 నెలల పాటు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం మరియు వసతి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వారి భవిష్యత్తు ను బంగారు మయంగా తీర్చిదిద్దుకోవాలని ఈ సందర్భంగా కోరారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర

Leave A Reply

Your email address will not be published.