ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ లో నమోదు కై తరలివచ్చిన నిరుద్యోగులు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : హైదరాబాద్ లో ప్రజా బంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే 3 నెలల గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ లో నమోదవడానికి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. వారందరికీ భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు అభినందనలు తెలియజేస్తూ 3 నెలల పాటు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం మరియు వసతి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ రోజు హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ ను సందర్శించి విద్యార్థుల తో మాట్లాడి అక్కడి సౌకర్యాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారునిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వారి భవిష్యత్తు ను తీర్చిదిద్దుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.