పాత్రికేయుడు కేశవులు కుటుంబాన్ని ఆదుకోవాలి తహశీల్దార్ గారికి వినతి పత్రం అందచేస్తున పాత్రికేయులు

కర్నూలు జిల్లా , నంద్యాల పట్టణముణంలో యూట్యూబ్ ఛానల్ పాత్రికేయుడు కేశవులు తమ విధిని జంకు బొంకులకు తావివ్వక నిజాన్ని నిక్కచ్చిగా చూపితే ..అతనిని దారుణంగా హత్య చేయటం.. సమాజంలో నాలుగవ స్తంబంగా ప్రజా క్షేమాన్ని కోరే వారికి ఇదా ప్రతిఫలం..అంటూ ఈ హత్య మమ్ములను దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్యాపిలి మండల పాత్రికేయులు ఆవేదన చెందారు. విలేకరి తన కుటుంబాన్ని వదులుకొని అఖుంటిత దీక్షతో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చేందుకు పడుతున్న తపనకు, సమాజసేవలో నిస్వార్థంగా పనిచేస్తున్న పత్రికేయులకే ప్రభుత్వము రక్షణ కల్పించలేక పోవడం శోచనీయమని, కావున ప్రభుత్వము తక్షణమే పాత్రికేయులకు రక్షణ కల్పించడంతో పాటు భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావ్రుతము కాకుండా ఉండేందుకు హత్యకు పూనుకున్న వారిని కఠినంగా శికించేందుకు చర్యలు తీసుకోవలసిన అవసరం వుందన్నారు. అలేగే హత్యకు గురైన యూట్యూబ్ పాత్రికేయుడు కేశవులు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము కల్పిస్తూ బాధిత కుటుంబానికి రూ .50,0000 / – లక్షలు ఎక్స్ గ్రేసియ చెల్లించాలని కోరుతూ తహశీల్దారు శివరాముడు గారికి వినతిపత్రం అందజేశారు. ప్యాపిలి వారు ఈ విషయాన్ని జిల్లా అధికారులు మరియు ప్రభుత్వము దృష్టికి తీసుకు వెళ్లవలసినదిగా కోరారు.

? ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.