నిధులు కేటాయించాలని కలెక్టర్ కు వినతిపత్రం
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ గారిని కలిసి తలమడుగు మండలంలోని పల్సి.K, చర్లపల్లి, రత్నపుర్, డోర్లి, మరియు మిగత 400 లోపు జనాభా ఉన్న గ్రామాలకు గ్రామఅభివృద్ధికి నిధులు సరిపోవడం లేదు కనుక పల్లె ప్రగతి కార్యక్రమనిధుల నుండి గ్రామల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మరియు మండలంలోని పలు సమస్యల పరిష్కరనికి నిధులు కేటాయించాలని తలమడుగు ZPTC గోక గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వీరి వెంట బజార్హత్నూర్ మండల జడ్పిటిసి మల్లెపూల నరసయ్య , బోథ్ మండలం పోచ్చారా గ్రామ సర్పంచ్ మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రావు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.