నకిలీ బంగారం విక్రయించే ముఠా అరెస్ట్

చిత్తూరు జిల్లా గంగవరంమండలంకూర్నిపల్లి వద్ద నకిలీ బంగారం విక్రయించే ముగ్గురు ముఠా సభ్యులను వలపన్ని పట్టుకున్న పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రమేష్ అతని స్నేహితులు ఇద్దరు కలిసి, తమకు చిత్తూరు జిల్లా కాణిపాకం వద్ద చెరువులో జెసిబి ద్వారా మట్టి తీస్తుండగా మట్టి కుండ కనబడిందని, అందులో కిలో బరువు గల బంగారుహారం దొరికిందని అదే జిల్లాకు చెందిన పల్లపు రాజు కు తెలిపారు, ఇంత బంగారాన్ని మేము అమ్ముకో లేమని మాకు కొంత డబ్బు ఇచ్చి ఇది తీసుకోమని నమ్మబలికారు. దీంతో 12 లక్షలకు బేరం కుదుర్చుకుని ,వారిని నెల్లూరు, తిరుపతి ,పలమనేరు బైపాస్ రోడ్లలో తిప్పి చివరకు గంగవరం మండలం బెంగళూరు హైవే వద్దకు రమ్మని చెప్పి 12 లక్షలు తీసుకొని నకిలీ బంగారం వారికి ముట్టజెప్పి వెళ్లిపోయారు. తీరా బంగారాన్ని పరీక్షించగా నకిలీదని తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు కట్టి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారు వాడిన మొబైల్ ఫోన్ నెంబర్ ఆధారంగా వారి ఆచూకీ కనిపెట్టి ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి తొమ్మిది లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. బైట్ :గంగయ్య _డిఎస్పి పలమనేరు.

 

Leave A Reply

Your email address will not be published.