జయశంకర్ జీవితం యువతకు ఆదర్శం: హరీష్ రావు

సిద్ధిపేట: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఘనంగా జరిగాయి.ఈ మేరకు ముస్తాబాద్ సర్కిల్ లోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు జయశంకర్ తెలంగాణ కోసం చేసిన సేవలను మంత్రి కొనియాడారు.జయశంకర్జీ వితం నేటి యువతకు ఆదర్శమని, స్ఫూర్తిదాయకమని హరీశ్ రావు పేర్కొన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన తన జీవితాంతం పోరాడారని ఆయన కొనియాడారు.రాష్ట్ర ఏర్పాటే తన ఏకైక ఎజెండాగా తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారని హరీశ్ రావు తెలిపారు.జయశంకర్ ఆశయాల సాధనలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.ప్రత్యేక రాష్ట్ర సాధనలో జయశంకర్ సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు.జయశంకర్ నడుస్తున్న తెలంగాణ చారిత్రక గ్రంథంగా ఉండే వారని మంత్రి వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.