ఘనంగా తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగర్ కర్నూలు జిల్లా ఘనంగా తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి కార్యక్రమంఈరోజు కల్వకుర్తి విద్యానగర్ జాగృతి కార్యాలయం నందు జాగృతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, మలిదశ ఉద్యమ కెరటం ,తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి పోసిన జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలవేసి వారికి నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జాగృతి నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ మిరియాల పావని, జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ దారమోని గణేష్, కల్వకుర్తి నియోజకవర్గం జాగృతి కన్వీనర్ పల్లా విజయలక్ష్మి, సుజాత, విద్యార్థి విభాగం నాయకులు అరుణ్, శివ ,అలీ, రమేష్ ,రాకేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.