గొర్రెల కాపరులను అటవీప్రాంతాల్లోకి అనుమతించాలి: అటవీశాఖ కన్సర్వేటర్ గారికి డా. పాల్వాయి విజ్ఞప్తి

ఆసిఫాబాద్:జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో * కౌటాల మండలం శీర్ష గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు సిర్పూర్ నియోజకవర్గ భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆధ్వర్యంలో కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, ఆదిలాబాద్ జి. రామలింగం గారిని కలవడం జరిగింది.గొర్రెల కాపరుల సమస్యలను కన్సర్వేటర్ గారికి వివరించడం జరిగింది. అటవీ ప్రాంతాల్లోకి గొర్రెలను మేతకై అనుమతించకపోవడం తో కాపరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా డా.పాల్వాయి తెలిపారు.ఒక వైపు ప్రభుత్వం గొర్రెల కాపారులకు గొర్రెల యూనిట్లను మంజూరు చేస్తామని అంటూ మరోవైపు గొర్రెలను మేత కోసం అటవీ ప్రాంతాల్లోకి అనుమతించక పోవడంతో కాపరులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు డా.పాల్వాయి.కన్సర్వేటర్ గారు స్పందిస్తూ దీనికి ఒక పరిష్కారం కనుగొనడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.