కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు

మద్దికేర మండల కేంద్రంలోనీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు కుష్టువ్యాధి గ్రస్తులకు అవగాహన డాక్టర్ నాగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైరస్‌,బ్యాక్టీరియా వలన వ్యాధులు సంక్రమిస్తున్నట్లు తెలిపారు. మైక్రో బ్యాక్టీరియా లెప్రే అను సూక్ష్మ క్రిమి ద్వారా కుష్టు వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలిపారు. తుంపర ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్నారు.సాధారణంగా కుష్టు వ్యాధి చలి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మనిషి బాడీలోకి చేరిన ఐదేళ్ల తర్వాతే లక్షణాలు బయట పడతాయి. ఎక్కువగా చేతులు, కాళ్లకు వ్యాధి సోకుతుంది. అది నయం అవ్వడానికి దాదాపు సంవత్సరం పడుతుంది. మల్టీ డ్రగ్‌ థెరపీ ద్వారా కుష్టును పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్లు చెప్పినట్లు మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఈ కార్యక్రమంలో డి పి ఎమ్ వో మరియా దాస్, ధనలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా, పి హెచ్ ఎన్ సరస్వతి, హెల్త్ సూపర్వైజర్ రామ్మోహన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.