కాళేశ్వరం లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.

కాలేశ్వరంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య సేవలను పొందాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రజలకు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కాలేశ్వరంని సందర్శించి కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంలో పూజలు చేసి ఆలయంలో పత్రీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులచే కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో మారుతి ని ఆదేశించారు.
అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ భవనంలో ఏర్పాటుచేసిన phc ని సందర్శించి త్వరలోనే ప్రజాప్రతినిధులచే పిహెచ్ సి ని అధికారికంగా ప్రారంభించు కుందామని అప్పటి వరకు కాలేశ్వరం ప్రజలకు మరియు భక్తులకు వైద్య సేవలు అందించేందుకు వెంటనే అవసరమైన వైద్య పరికరాలు మందులు కొనుగోలు చేసి ప్రయోగాత్మకంగా వైద్య సేవలను ప్రజలకు అందించాలని, వైద్య పరీక్షల నిర్వహణకు ల్యాబ్ ను, సెల్ కౌంటర్ ను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. శ్రీరామ్ ను ఆదేశించారు. పీహెచ్సీలో వైద్య సిబ్బందితో సమావేశాలు నిర్వహించేలా మీటింగ్ హాల్ ను నిర్మించాలని పంచాయతీ రాజ్ డిఈ సాయిలు, ఏఈ రాజేందర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

కాళేశ్వరం వేములవాడ గస్ట్ హౌస్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో పల్లె ప్రగతి, కాళేశ్వరం ఆలయం పనులపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఆలయంలో పూర్తి కానీ రెండు పనులు కాన్సెల్ చేసినట్లు మళ్ళీ టెండర్ పిలిచి పనులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, అంబటిపల్లి phc లలో సెల్ కాంటర్, ల్యాబ్ లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా మెడికల్ క్యాంపులను నిర్వహించి డెంగ్యూ, మలేరియా తదితర వైద్య పరీక్షలను నిర్వహించి ఆయా వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా నిర్వహించాలని ప్రతిరోజు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు వ్యాక్సినేషన్ చేయాలని అన్నారు. గోదావరి తీరంలో ఉన్న మహదేవపూర్, పలిమెల మండలంలోని గ్రామాలలో త్రాగునీరు సరఫరాలో సమస్య రాకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల మరియు ఇతర సిబ్బందిని ఆదేశించారు. cc రోడ్లు మంచిగా వేయాలని పంచాయతీ రాజ్ ఏఈ రాజేందర్,డిఇ సాయిలు ను ఆదేశించారు. కాళేశ్వరంలో సర్వే no 129,142 ప్రభుత్వ భూములని ఆ భూములలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ఉపయోగించాలని తాసిల్దార్ శ్రీనివాస్ కు తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఎవరి వద్ద అయినా భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటే ఆ డాక్యుమెంట్లతో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించాలని అన్నారు. మహాదేవపూర్ లో ఉన్న ల్యాండ్ సమస్య లు పరిష్కరించాలని, మహాదేవపూర్ లో వివాదంలో ఉన్న భూమిలో ఇల్లు కట్టుకున్న వారికి కొత్తగా ఇంటి నెంబర్ లు ఇవ్వకూడదని, పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఇండ్ల పర్మిషన్ ఇవ్వాలని అన్నారు. మహాదేవపూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఎంపీడీవో, తాసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నారు. బొమ్మ పూర్ గ్రామంలో నాబార్డు సహకారంతో వ్యవసాయ సహకార సంఘాల వారు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ రైస్ మిల్ కు వెంటనే నాలుగు ఎకరాల స్థలాన్ని అందించాలని తాసిల్దార్ శ్రీనివాస్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వన్ భాష షేక్, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. శ్రీరామ్, ఎంపీపీ బి.రాణిబాయి రామారావు, కాలేశ్వరం ముక్తీశ్వర ఆలయ ఈఓ మారుతీ, ఎంపీడీఓ శంకర్, జెడ్పిటిసి గుడాల అరుణ, ఎంపీటీసీ మమత, సర్పంచ్ వసంత, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.