ఏనుగుల వల్ల భయాందోళనలో గ్రామాల ప్రజలు

విజయనగరం జిల్లా కోమరడా. మండల0 నాగావళి నది ఆగట్టు నా ఐదు ఏనుగులు
ఈ గట్టున ఒక ఏనుగుఆ గట్టుకెళ్లాలా ఈ గట్టు కు వెళ్లాలా అంటూ అడివి శాఖాధికారులు తల పట్టుకునే పరిస్థితిఏనుగులు వల్ల ఏ రోజు ఏమి చేస్తాయో అంటూ భయాందోళనలో వివిద గ్రామాల ప్రజలు రైతులుఇది ఇప్పుడు ప్రస్తుతం ఏనుగుల పరిస్థితిఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి కొమరాడ మండల కేంద్రంలో పత్రికా విలేకర్ల సమావేశంలో సోమవారం మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చిన ఎనిమిది ఏనుగులలొ మూడు ఏనుగులు చనిపోగా చిన్న పిల్లలతో 6 ఏనుగుతో ఇప్పుడు కురుపాం నియోజకవర్గంలో వివిధ మండలాల్లో ఇప్పటికే మూడు ఏనుగులు చనిపోగా ఆరు ఏనుగులు కలిసి జీవించి ఉండగా గడిచిన ఆరు రోజుల వ్యవధిలో కురుపాం నియోజకవర్గంలో గల జియ్యమ్మవలస మండలం లో కు ౦దర తిరువాడ కుదమగ్రామాల్లో రాత్రీపగలు తిరుగుతుండగా మరో ఒక ఏనుగు కొమరాడ మండలంలో గల జంజావతి రబ్బరుడ్యామ్ ఏరియాలో అటు ఒడిశా గ్రామాలతోపాటు పెళ్లి గుడ్డి వలస డంగభద్ర లక్షింపేట కొండవలస కుమ్మరిగుంట కంభవలస పంచాయితీల్లోనూ పాటు ఒరిస్సా అలమండ తొపాటు కొన్ని గ్రామాల్లో రాత్రి పగలు ఏనుగులు తిరగటం వల్ల అటు జియ్యమ్మవలస ఇటు కొమరాడ మండల ప్రజలు భయబ్రాంతులు చెందుతూ ఏ రోజు ఏం జరుగుతుందో అంటూ బిక్కుబిక్కుమని జీవించే పరిస్థితి కనిపిస్తోందనిఇలాంటి సందర్భంలో సంబంధిత అటవీశాఖ అధికారులు గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో అటుహెలిప్యాంట్ వైల్డ్ సిబ్బందితో పాటు రాత్రి పగలు కష్టపడి పని చేసినప్పటికీ ( రెడ్డి వచ్చారుా మొదలెట్టు అన్నా సామెత)మాదిరిగా ఏనుగులు ఎక్కడినుండి వచ్చాయో అక్కడికి వెళ్లే విధంగా ఒక్క అడుగు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పక తప్పదు
ఇలా మూడున్నర సంవత్సరాల కాలంలో అటు ఏనుగులు ఇటు అటవీశాఖ సిబ్బంది అప్పుడప్పుడు స్థానిక పోలీస్ సిబ్బంది తప్ప ఏ ఇతర శాఖలకు కూడా సంబంధం లేని విధంగా వ్యవహరించడం చాలా అన్యాయమని ఇతర రెవెన్యూ, సచివాలయం, వాలంటీర్లు ,ఎంపీడీవో,రెవెన్యూ శాఖల ,ఏనుగులు గురించి సిమంత కూడా పట్టించుకోకపోవడం చాలా అన్యాయమని ఈ ప్రభుత్వ శాఖలు రాష్ట్రప్రభుత్వం పరిధిలోకి రావా ఏనుగుల ఏమి చేసినా వారికి సంబంధం లేదా ఇలాంటి సందర్భంలో నష్టపరిహారం కూడా నేటికి రెండు సంవత్సరాల కాలంగా రైతులకి రాని పరిస్థితి ఉందని దీనికి పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారు అని వ్యవసాయశాఖ అధికారులా, హార్టికల్చర్ ,అధికారులా అటవీశాఖ ,అధికారులా లేక రెవెన్యూ శాఖ అధికారులా,ఎవరుా పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం వల్ల రైతులకు నష్ట పరిహారం నేటికీ పూర్తిస్థాయిలో చెల్లించలేని పరిస్థితి ఉందని ఇలా అయితే ఏనుగులు వల్ల నష్టపోయిన రైతులకు భరోసా ఎలా అని
ఇంత జరుగుతున్నా అటవీ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు గానీ
ఇప్పుడు పాలకులుగా ఉన్న అటవీ శాఖ మంత్రిగాని
ఏనుగుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దేనికి నిదర్శనం అని
ఇలా అయితే ఏనుగులు వల్ల ప్రజలకు భరోసా ఎలా అని
నేటికీ పంట నష్టపరిహారం పూర్తిస్థాయిలో ఇవ్వలేదని అలాగే రాత్రి పగలు పని చెస్తున్నా కిందిస్థాయి సిబ్బంది కూడా నెలలకొద్ది జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని అలాగే ఏనుగులు వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు కూడా నేటికీ కొంతమందికి పూర్తిస్థాయిలోనష్టపరిహారం చెల్లించిన పరిస్థితి ఉందని
ఇలాంటి సందర్భంలో అటు రాష్ట్రస్థాయి అటవీశాఖాధికారులు మనలను పరిపాలిస్తున్న పాలకులు అటవీశాఖ మంత్రి ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పటికైనా ఎంతైనా ఉందని చెప్పకతప్పదు ఆ దిశగా అటు అటవీశాఖ రాష్ట్రస్థాయి అధికారులు గానీ ఇటు మనల్ని పాలిస్తున్న పాలకులు గానీ తక్షణమే ఆలోచించి ఈ ఆరు ఏనుగులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడి తరలించే విధంగా భవిష్యత్తు ప్రణాళిక ఉండాలని లేని యెడల ఇంకా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోందని కావున ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నాము..

Leave A Reply

Your email address will not be published.